అత్తిలిపాపగా వస్తున్న రత్తాలు..!

240
lakshmi rai

వెండితెరపై భారీ అందాల భామలుగా క్రేజ్ తెచ్చుకున్న కథానాయికలలో రాయ్ లక్ష్మి ఒకరు. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేస్తూ గ్లామర్ పరంగా రాయ్ లక్ష్మి యూత్‌ మతిపోగొట్టేసింది. ‘జూలి 2’తో మళ్లీ వెండితెరపై మెరిసిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి టాలీవుడ్‌లో సందడి చేసేందుకు సిద్ధమైంది.

చిరుతో రత్తాలు రత్తాలు అంటూ ఖైదీ నెంబర్ 150లో స్టెప్టులేసిన ఈ బ్యూటీ తాజాగా మరోసారి ఐటెం సాంగ్‌తో వస్తోంది. కృష్ణ కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి అనే చిత్రంలో మాస్‌ సాంగ్‌తో మతిపొగొట్టింది.

సస్పెన్స్, థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని అత్తిలి పాప అనే సాంగ్ లిరిక‌ల్ వీడియోని విడుద‌ల చేశారు. సురేష్ బ‌నిశెట్టి లిరిక్స్ ఈ పాట‌కి లిరిక్స్ అందించ‌గా హ‌రి గౌర‌, మంగిలి క‌లిసి ఆల‌పించారు. ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలుస్తుందని నిర్మాతలు అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తుండగా.. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Laxmi Raai's Papa Atthili Papa Full Song Lyrical | Where is The Venkatalakshmi Songs | Mangli