మెగాస్టార్ మూవీ రిమేక్…

199
Lawrence to Remake Chiru's Movie
- Advertisement -

ఇండస్ట్రీలో ప్రస్తుతం రీమేక్ ల ట్రెండ్ నడుస్తోంది. ఒక భాషలో హిట్ అయిన సినిమాలను పరాయి భాషలలో తెరకెక్కిస్తూ మంచి వసూళ్ళను రాబడుతున్నారు చిత్ర నిర్మాతలు. స్టార్ హీరోల నుండి యంగ్ జనరేషన్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఇదే మంత్రాన్ని పఠిస్తున్నారు. అయితే కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్ కాస్త వైవిధ్యంగా ఆలోచించాడు.

ముని సీరిస్ లైన కంచన, గంగ సినిమాలతో ఈ లారెన్స్ ఇటు నటుడిగా, డైరెక్టర్ తన టాలెంట్ చూపించాడు. గంగ సినిమాతో భారీ హిట్టు కొట్టిన మల్టీటాలెంటెడ్ ఇప్పుడు చిరంజీవి మూవీనే రిమేక్ చేయబోతుండడం విశేషంగా మారింది.మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ మూవీస్ లో ముగ్గురు మొనగాళ్లు ఒకటి. చిరు త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయమే సాధించింది. ఇందులోని మూడు క్యారెక్టర్లలో చిరు చూపించిన వైవిధ్యం.. ఆయన నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమా మెగా అభిమానుల్ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాను ఇప్పుడు లారెన్స్ రీమేక్ చేయబోతున్నాడట.

ముగ్గరు మొనగాళ్లు సినిమా నిజానికి రజనీకాంత్ హీరోగా చేసిన మూండ్రు ముగమ్ కి రిమేక్ గా తెరకెక్కింది. ఇప్పుడు ఇదే చిత్రం రిమేక్ లో లారెన్స్ సైతం మూడు క్యారెక్టర్స్ లో తన మల్టీటాలెంట్ ని మరోసారి చూపించాలని ఆశపడుతున్నాడట. ఈ చిత్రానికి నిర్మాత కూడా లారెన్సేనట. అయితే దర్శకత్వ బాధ్యతలు మాత్రం వేరే దర్శకుడికి అప్పగిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాని ఇప్పటి జనరేషన్ కి తగ్గట్లగా డీల్ చేసే దర్శకుడి కోసం లారెన్స్ సర్చ్ చేస్తున్నాడట. గంగలో రెండు రకాల పాత్రలతో అదరగొట్టిన లారెన్స్ ఈ ముగ్గరు మొనగాళ్లు రిమేక్ లో మూడు రకాల పాత్రలతో అదుర్స్ అనిపిస్తాడేమో చూడాలి.

మెగాస్టార్‌ చిరంజీవి 150వ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.గతంలో చిరుతో వీణ స్టెప్ వేయించిన లారెన్స్‌…ఈ సినిమాలో మరోసారి తనదైన స్టెప్పులతో అలరించనున్నాడు. చిరంజీవి స్వయంగా లారెన్స్ కు ఈ విషయమై కబురు పంపారు. చిరంజీవి సినిమా అంటేనే స్టెప్స్ కాబట్టి తన అభిమానులను నిరాశ పరచకుండా చిరంజీవి తన డాన్స్ మూమెంట్స్ విషయమై భారీ హోంవర్క్ కు సిద్ధపడుతున్నాడట.

- Advertisement -