లావణ్య అప్పటి వీడియో వైరల్

36
- Advertisement -

టాలీవుడ్ లవ్ కపుల్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి వివాహానికి సినీ ప్రముఖులు హాజరై వధూవరులను దీవించారు. ఈ నేపథ్యంలో లావణ్య నటించిన ‘అందాల రాక్షసి’ చిత్రంలోని ఓ వీడియో క్లిప్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఓ చిన్నారి.. ‘అక్క నీ పెళ్లికి సినిమా యాక్టర్లు వస్తున్నారంట కదా.. చిరంజీవి కూడా వస్తున్నాడా.’ అని అడుగుతుంది. దీనికి లావణ్య అవును అన్నట్టు తల ఊపుతుంది. కాగా ఇప్పుడు నిజ జీవితంలో అదే జరిగింది. దాంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక ఇటలీలో జరిగిన వరుణ్, లావణ్య పెళ్ళికి మెగా ఫ్యామిలీతో పాటు పలువురు సినీతారలు కూడా హాజరయ్యారు.

అయితే కొద్దిసేపటి క్రితమే వరుణ్, లావణ్యతో పాటు మెగా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. దీంతో ఎయిర్ పోర్ట్ లో సందడి వాతావరణం నెలకొంది. వీటికి సంబంధిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరోవైపు మెగాస్టార్ సోదరుడు నాగబాబు ఇన్ స్టా వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగబాబు కలిసి ఉన్న ఫొటో షేర్ చేస్తూ తమ మధ్య భేదాభిప్రాయాలు, వాదనలు ఉన్నప్పటికీ తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఆ అనుబంధం తాము చేసిన పనులకు, వాటి జ్ఞాపకాలకు చెందినది మాత్రమే కాదని అది ఎంతో లోతైన బంధమన్నారు. తమది విడదీయలేని అనుబంధమని తెలిపారు.

అయితే, ఈ పెళ్లి వేడుకలకు పవర్ స్టార్ హాజరైన మరో ఫొటో బయటకు వచ్చింది. ఇప్పటికే పవన్ తన ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫొటో రాగా.. తాజాగా పవన్-రాంచరణ్ నవ్వుతూ నడుస్తున్న మరో ఫొటో బయటకొచ్చింది. దీంతో నెటిజన్లు ‘బాబాయ్అబ్బాయ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌కు ఈ ఫొటో జత చేసి ట్రెండ్ చేస్తున్నారు.

Also Read:కాంగ్రెస్ కు పెద్ద పరీక్షే ఇది?

- Advertisement -