ఐపీఎల్ ఆడకపోవచ్చు.. కానీ మ్యాచ్‌లన్నీ చూస్తా!

58
Jason Roy

ఐపీఎల్ 2021 వేలం ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి వేలంలో కీ ఆటగాళ్లను దక్కించుకునేందుకు ప్రాంఛైజీలు మొగ్గుచూపలేదు. ఇందులో ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మెన్‌ జేసన్‌ రాయ్‌ ఒకరు. ఈ నేపథ్యంలో ట్విట్టర్‌ ద్వారా స్పందించారు రాయ్.

ఐపీఎల్‌ మినీ వేలంలో అమ్ముడుపోనందుకు తానెం బాధపడట్లదని..తన ప్రదర్శణ వారిని మెప్పించలేదన్నారు. ఐపీఎల్ వేలంలో చోటు దక్కించుకోనందుకు అవమానభారంగాను ఫీలవ్వనని తేల్చి చెప్పాడు. వేలంలో మంచి ధర దక్కించుకున్న ఆటగాళ్లకు అభినందనలు తెలిపిన రాయ్.. ఈ ఐపీఎల్ ఆడకపోవచ్చు.. కానీ మ్యాచ్‌లన్నీ కచ్చితంగా చూస్తా అని వెల్లడించారు.