నాలా నా పిల్లలు కష్టపడొద్దు- సన్నీ

214
Latest News on Sunny Leone
- Advertisement -

పోర్న్‌ స్టార్‌ నుండి బాలీవుడ్‌ స్టార్‌గా ఎదిగిన సన్నీ లియోన్‌ బిగ్‌బాస్‌ షో పాపులారిటితో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. సన్నీ అనగానే జనాలు చూసే కోణమే వేరుగా ఉంటుంది. ఐతే ఆమెలోని ఎమోషనల్ సైడ్ కూడా అప్పుడప్పడూ బయటికి వస్తుంటుంది. ఈ అమ్మడు ఇండియాకు వచ్చి తన భర్తతో కులిసి ఇక్కడే సెటిలైపోయింది..

గత ఏడాది ఓ ఆడపిల్లను దత్తత తీసుకున్న సన్నీ ఆ తర్వాత మరో ఇద్దరి పిల్లల్ని దత్తత తీసుకుంది. ఆమె పలు సేవా కార్యక్రమాలతోనూ తన ప్రత్యేకతను చాటుకుంది. సన్నీ జీవితాధారంగా ‘కరణ్‌జీత్‌ కౌర్‌-ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నీ లియోనీ’ టైటిల్‌తో బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి.. వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ సన్నీ ఉద్వేగానికి గురైంది. కన్నీళ్లు కూడా పెట్టుకుంది.

Latest News on Sunny Leone

21 ఏళ్ల వయసులో తనను ద్వేషిస్తూ ఎందరో మెయిల్స్‌, మెసేజ్‌ లు పంపేవారని గుర్తు చేసుకుంది. ఏ దేశానికి చెందిన వారు అన్నది పక్కన పెడితే సమాజం ధోరణి అలా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ వయసులో అలాంటి అసభ్య పదాలు జీవితంపై చాలా ప్రభావం చూపుతాయని చెప్పింది. ఈ మెయిల్స్, మెసేజ్ లను చూసి తాను లోలోపల చాలా కుంగిపోయానని తెలిపింది.

అలాంటి టైమ్‌లో తనకు తన పెరెంట్స్‌ అండగా నిలిచారని చెప్పింది. వారికి నచ్చని రంగం ఎంచుకున్నప్పటికీ వారు తనకు అండగా నిలిచారని తెలిపింది. అందుకే తన జీవితం ఎలా ఉన్నా ప్రేమిస్తానని తెలిపింది. మన జీవితంలో ఏం జరిగినా ఒక కారణం ఉంటుందని పెద్దలు చెబుతుంటారని, తాను ఎదుర్కొన్న ఇబ్బందులు తన పిల్లలు ఎదుర్కోకూడదని చెప్పింది. స్వేచ్ఛగా, ఎదుటివారిని బాధపెట్టకుండా, వారు ఎంచుకున్న రంగాలను తాను ఇష్టపడినా, పడకున్నా… వారు మాత్రం ఆనందంగా ఉండాలని కోరుకుంది.

- Advertisement -