తెలంగాణ కాంగ్రెస్ లో నిత్య అసంతృప్తి వాదులుగా ముద్రపడి, పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ఢీ అంటే ఢీ అనే నేతలు కాంగ్రెస్ లో చాలా మందే ఉన్నారు. ఇందులో మీడియా ముందు కనపడే ప్రధాన నేతల్లో జగ్గారెడ్డి ఒకరు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక తిరుగుబాటు బావుట ఎగురవేసి, అసమ్మతి నేతలకు మౌత్ పీస్ గా మారిపోయారని పార్టీలోనే చర్చ జరిగింది. అయితే, ఇటీవల రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చాక రేవంత్ రెడ్డి తన మాటలను రాహుల్ తో చెప్పించటంలో సక్సెస్ అయ్యారు. దీంతో జగ్గారెడ్డి సైలెంట్ అయ్యారు. పార్టీ గొడవలను మీడియా ముందు పెడితే ఎంత పెద్ద నాయకుడు అయినా సరే బయటకు పంపటమే అని రాహుల్ నేరుగా చెప్పటంతో జగ్గన్న కాస్త సైలెంట్ అయ్యారు.
కానీ కోమటిరెడ్డి సంగతేంటీ అనేదే ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు రాజగోపాల్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యే. అయినా రాహుల్ గాంధీ మీటింగ్ కు డుమ్మా కొట్టారు. పైగా తాను బీజేపీలో చేరుతానని ఓపెన్ గానే కామెంట్ చేసి చాలా కాలం అయ్యింది. ఇందుకు తోడు రాహుల్ గాంధీ మీటింగ్స్ లో కోమటిరెడ్డికి దక్కాల్సినంత ప్రాధాన్యత దక్కలేదని, తనను నలుగురిలో ఒకరిగానే చూశారు తప్పా తనకంటూ ఓ ప్రత్యేకత లేకుండా పోయిందని… ఇదంతా పార్టీలో రేవంత్ వర్గం కావాలనే చేసిందన్న అసంతృప్తి కోమటిరెడ్డి వర్గం నేతల్లో ఉందన్న చర్చ సాగుతుంది.
పార్టీ డయాస్ పై, రాహుల్ మీటింగ్స్, తను చంచల్ గూడ జైలుకు వెళ్లే సమయంలో తనకు అవకాశం లేకపోవటం వంటి అంశాలను కోమటిరెడ్డి టీం అవమానకరంగా భావించిందని, ఇది రాబోయే రోజుల్లో ఎటు దారితీస్తుందో చెప్పలేం కానీ ఆయనతై మర్చిపోరని కోమటిరెడ్డి టీం వ్యాఖ్యానిస్తోంది. ఉమ్మడిగా వెళ్ధాం అని చెప్తూనే తమ మైలేజ్ తాము చూసుకుంటే ఉమ్మడి పోరాటాలు ఎలా సాధ్యం అవుతాయని రాష్ట్ర నాయకత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.