రికార్డు క్రియేట్‌ చేసిన “ఎఫ్ 3” ట్రైలర్..

95
F3
- Advertisement -

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి ఫన్ ఫ్రాంచైజీ ఎఫ్3 తో థియేటర్లలో నవ్వులు పంచడానికి సమ్మర్ సోగ్గాళ్ళుగా రాబోతున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. నిన్న ఎఫ్3 థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఎఫ్3 సమ్మర్ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ కాబోతుందని థియేట్రికల్ ట్రైలర్‌ చూస్తే అర్ధమౌతుంది.

ఈ ట్రైలర్‌ విడుదలైన 24 గంటల్లో 12.5 మిలియన్ కి పైగా వ్యూస్ రాగా, 260K కి పైగా లైక్స్ రావడం విశేషం. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండటం తో “ఎఫ్ 3 ” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరీన్ తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. మొత్తానికి ఎఫ్ 3 ట్రైలర్ సినిమాపై అంచనాలని డబల్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్3 థియేటర్లలోకి వస్తుంది.

- Advertisement -