తెలంగాణ యాసలో నాని…!

133
nani

టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం`ట‌క్‌…జ‌గ‌దీష్‌` . నాని న‌టిస్తున్న 26వ చిత్రమిది. `నిన్నుకోరి` వంటి సూప‌ర్‌హిట్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతుండగా షైన్ స్క్రీన్స్ ప‌తాకంపై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం త‌ర్వాత నాని స‌ర‌స‌న రీతూవ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తున్నారు. అలాగే `కౌస‌ల్య‌కృష్ణ‌మూర్తి` ఫేమ్ ఐశ్వ‌ర్యా రాజేష్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తున్నారు.

ఈ సినిమా తర్వాత రాహుల్ సంక్రిత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘శ్యామ్‌సింగ‌రాయ్’ సినిమాలో న‌టించ‌బోతున్నారు. దీంతో పాటు వివేక్ ఆత్రేయ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాని.

ఈ సినిమాలతో పాటు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తోన్న శ్రీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో నాని సినిమా చేయ‌బోతున్నార‌ట‌. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ర‌స్టిక్ లవ్‌స్టోరిగా ఈ మూవీ తెరకెక్కనుందట. మొత్తంగా వరుస సినిమాలతో అలరించేందుకు నాని సిద్ధమవుతున్నాడు.