నవరస నట సార్వభౌముడు కైకాల సత్యనారాయణ ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో తుదిశ్వాసను విడిచారు. రేపు హైదరాబాద్ మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు జరగనున్నాయి. ఇప్పటికే సినీప్రముఖులు, రాజకీయ నాయకులు, ప్రేక్షక అభిమానులు కైకాల కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. 200 మందికి పైగా దర్శకులతో పనిచేసిన ఘనత కేవలం కైకలా సత్యనారాయణకు మాత్రమే సొంతం. పైగా కైకాల సత్యనారాయణ గారు ఒక టాలీవుడ్ నటుడిగానే కాకుండా ఆయన భారత పార్లమెంటు మాజీ సభ్యుడు కూడా. తన 60 సంవత్సరాల సినీజీవితంలో ఉన్న ఆయన మొత్తం 777 సినిమాల్లో నటించారు.
ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేసారు. హాస్య, ప్రతినాయక, నాయక, ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు జీవం పోశారు. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు పొందారు. ఎస్.వి.రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో కైకాల గారు ముఖ్యులు. అందుకే కైకాల సత్యనారాయణ గారి ట్రాక్ రికార్డ్ అపూర్వం.
ఇక కైకాల సత్యనారాయణ కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జులై 25న జన్మించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. కైకాల సత్యనారాయణ ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తిచేసి, గుడివాడ కళాశాల నుంచి పట్టభద్రుడయ్యారు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఏది ఏమైనా కైకాల తిరుగులేని సంపూర్ణ నటుడు.
ఇవి కూడా చదవండి…