బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ఆదివారంతో 78 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. 78 ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి నుండి ఎవరు ఊహించని విధంగా లాస్య ఎలిమినేట్ అయింది. అయితే ఇంటినుండి ఎవరు వెళ్లిపోతున్నా కంటతడి పెట్టిన లాస్య తాను మాత్రం నవ్వుతూ బయటకు వచ్చేసింది.
తొమ్మిదో వారం నామినేషన్స్‌లో అభిజీత్, అరియానా, హారిక, లాస్య, సోహెల్ ఉండగా.. ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగ్ చివరికి కాసేపు టెన్షన్ అనంతరం లాస్య ఎలిమినేట్ అయినట్లు తెలిపారు. బిగ్ బాస్ ఇంటిలో నుంచి వేదికపైకి వచ్చిన లాస్యకు తన జర్నీని తెరపై వేసి చూపించారు నాగార్జున.
తర్వాత ఇంటి సభ్యులతో మాట్లాడారు. చివరి వరకు టాప్ 2లో సొహైల్,అభిజిత్ ఉంటారని తెలిపింది లాస్య. ఇంట్లో అవినాష్ మంచి ఎంటర్‌టైనర్ అని… అవినాష్ పాయింట్ టు పాయింట్ బాగా మాట్లాడతాడని.. కానీ, నామినేషన్స్ దగ్గరకి వచ్చేసరికి తనను ఎవరైనా ఒక మాటంటే చాలా ఫీలవుతాడని లాస్య అన్నారు.
మోనాల్ చాలా బాగా ఆడుతుందని.. కాకపోతే ఒక్కోసారి కన్‌ఫ్యూజన్‌లో ఉంటుందని…ఇక అరియానా ఒక టాస్క్‌లో తనను నామినేట్ చేయడానికి పరుగెడుతూ పడిపోతూ దెబ్బలు తగిలించుకుని మరీ వెళ్లిందని, అది తనకు బాగా నచ్చిందని లాస్య అన్నారు. సోహెల్‌కి నరాలు, కోపం ముక్కు మీదే ఉంటాయి. ఒక్కోసారి గొడవలు లేకపోతే అక్క గొడవులు పెట్టుకుందామా అని అడుగుతాడని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటే సూపర్బ్ అని తెలిపింది.
అఖిల్ చాలా బాగా ఆడుతున్నాడని..ఎదుటి వ్యక్తి చెప్పేది వినాలని లాస్య సూచించారు. హౌస్ మొత్తంలో తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అభిజీత్ అని అన్నారు లాస్య. తేడాలు ఏమీ చూపించడని, అందరినీ సమానంగా చూస్తాడని అన్నారు. హారిక చాలా అల్లరి పిల్ల అని, తనతో సమయాన్ని గడపడం తనకు చాలా ఇష్టమని చెప్పి బిగ్ బాస్ జర్నీని ముగించింది లాస్య.