అది చిరంజీవి కోసమే: రెజీనా

232
rejina

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆచార్య అనే టైటిల్ ఖరారు చేయగా తాజాగా మూవీకి సంబంధించి మరో అప్‌డేట్ వచ్చేసింది.

ప్రస్తుతం సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతుండగా ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ సాంగ్‌లో రెజీనా ఆడిపాడగా సాంగ్‌కు సంబంధించి వివరాలను వెల్లడించింది. తన కెరీర్‌లో ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ స్పెషల్ సాంగ్ అని చెప్పుకొచ్చింది. చిరంజీవి కోసమే తాను ఈ పాటలో నటిస్తున్నానని ..ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ సాంగ్ అన్నారు.

తనకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని…సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం తనను ఆచార్య టీం సంప్రదించినప్పుడు వెంటనే ఓకే చెప్పేశానని తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చిరుకి జోడీగా త్రిష నటిస్తుండగా సూపర్‌స్టార్ మహేష్ బాబు కీలక పాత్రలో నటించనున్నారు.