లోక్ సభ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు జరుగనుంది. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తీరారు. ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది.
బరిలో 904 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా మొత్తం 10.06 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు, హిమాచల్‌ప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, ఉత్తరప్రదేశ్‌లో 13, పశ్చిమ బెంగాల్‌లో 9, బీహార్‌లో 8, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3 స్థానాలతో పాటు చండీగఢ్ స్థానానికి పోలింగ్ జరగనుంది.
వారణాసి నుండి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి అజయ్ రాయ్, బీఎస్పీ నుంచి అతెర్ జమల్ లరి, యుగతులసి పార్టీ తరపున హైదరాబాద్‌కు చెందిన కొలిశెట్టి శివకుమార్ ప్రధానిపై పోటీచేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి నటి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి.
Also Read:ఆ తర్వాతే ఎగ్జిట్ పోల్స్: ఈసీ