పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు…

58
police
- Advertisement -

రాష్ట్రంలో పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తులకు ఇవాళ్టితో గడువు ముగియనుంది. వాస్తవానికి ఈ నెల 20న రాత్రి 10 గంటల వరకు తుది గడువు ముగిసింది. అయితే 20వ తేదీనే అప్లికేషన్లకు ఆఖరి తేదీ అని చెప్పడంతో.. చాలా మంది అభ్యర్థులు ఒకేసారి దరఖాస్తుకు చేసుకోవడానికి ప్రయత్నించడంతో సర్వర్ డౌన్ అయింది.దీంతో డేట్ పొడగించారు.

ఇక అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు యూనిఫాం సర్వీసెస్‌ ఉద్యోగాలకు ప్రభుత్వం మరో రెండేండ్లు వయోపరిమితి పెంచింది. అన్ని విభాగాల్లో కలిపి 17వేల 516 పోస్టులకుగాను ఇప్పటివరకు 11 లక్షల 80వేల దరఖాస్తులు వచ్చినట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ ముగియనుండటంతో ఖచ్చితమైన లెక్కలను త్వరలోనే బోర్డు వెల్లడించనుంది.

- Advertisement -