గ్యారెంటీలకు లాస్ట్ డేట్.. ఆందోళన!

29
- Advertisement -

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ హామీల అమలు కోసం ప్రజా పాలన పేరుతో దరఖాస్తుల స్వీకరణ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. యువ వికాసం, అభివృద్ధి మినహా మిగిలిన అయిదు హామీలకు ఒకే దరఖాస్తు ద్వారా అప్లై చేసుకునే వీలు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్రామాల్లో గ్రామ సభలు, పట్టణాల్లో ప్రత్యేక సభలు నిర్వహించి అర్హులైన వారు అప్లై చేసుకునే వీలు కల్పించింది. డిసెంబర్ 28 న ప్రారంభం అయిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ జనవరి 6 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం మొదట్లోనే స్పష్టం చేసింది. ఇప్పటికే లక్షల్లో ప్రజలు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆరు గ్యారెంటీల కోసం 93.38 లక్షల మంది దరఖాస్తు చేఊసుకోగా, ఇతర అవసరాల కోసం 15.55 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇక నేడే లాస్ట్ డేట్ కావడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

అయితే ఇంకా దరఖాస్తు చేసుకొని వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. నేడే లాస్ట్ డేట్ కావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. తేదీ ముగిసిన తర్వాత అప్లై చేసుకునే వీలు ఉంటుందా లేదా ? అనే సందేహాలు చాలమందిలో వ్యక్తమౌతున్నాయి. అయితే జనవరి 6 తర్వాత గడువు తేదీ పొడిగించే ప్రసక్తే లేదని ప్రభుత్వం చెబుతోంది. అర్హులైన మిగతా వారి కోసం మరో నాలుగు నెలల్లో ప్రజా పాలన సభలు మళ్ళీ ప్రారంభం అవుతాయని అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరు గ్యారెంటీల పేరుతో హామీలు ఇచ్చి వాటి అమలు విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరు అసంతృప్తిని కలిస్తోందని ప్రజలు వాపోతున్నారు. మరి ప్రజాభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల దరఖాస్తు గడువు పెంచే అవకాశం ఉందా లేదా అనేది చూడాలి.

Also Read:‘ఫ్యాటీలివర్’తో ప్రాణాలకే ముప్పు!

- Advertisement -