‘తమన్నా’ను ప్రస్తుతం ఐటమ్ సాంగ్ లకు కూడా తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. నిజంగా తమన్నాకి ఇప్పుడు అవకాశాలు కనుమరుగు అయ్యాయి. ఆమెతో సినిమాలు చేసేందుకు పెద్ద హీరోలు ఆసక్తి చూపడం లేదు. దాంతో, పెద్ద దర్శకులు ఆమెని అప్రోచ్ అవ్వడం లేదు. సరే చిన్నాచితకా హీరోల సినిమాలు అయినా వస్తాయి అనుకుంటే.. అక్కడా తమన్నాకి రెడ్ బోర్డు పెట్టేస్తున్నారు. రెమ్యునరేషన్ తగ్గించుకున్నా.. తమన్నా అదనపు ఖర్చులను తట్టుకోవడం కష్టం అంటున్నారు చిన్న నిర్మాతలు. దీనికితోడు సెట్ లో తనకన్నా చిన్న హీరోలు ఉంటే.. తమన్నా ఓ రేంజ్ లో బిల్డప్ ఇస్తోందని టాక్.
మొత్తంగా మే 2022లో విడుదలైన “ఎఫ్ 3” తర్వాత తమన్నాకి ఒక్క తెలుగు పెద్ద సినిమాలో కూడా అవకాశం రాలేదు. ఒకప్పుడు నెంబర్ వన్ హీరోయిన్ గా వెలిగిన ఈ భామని వరుసగా ఫ్లాపులు రావడంతో పట్టించుకోవడం మానేశారు నిర్మాతలు. దీనికితోడు, తమన్నాలో మునపటి బిగువ లేదు. వయసు కూడా 35కి దగ్గరలో ఉంది. అందుకే, తమన్నా ఐటమ్ సాంగ్ ల పై కూడా మొగ్గు చూపింది. కానీ, ఇప్పుడు అవి కూడా రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో తమన్నాకి ఓ ఊరట లభించింది. ఈ భామ తాజాగా ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం ఒప్పుకున్నట్లు సమాచారం.
తమన్నా మెయిన్ లీడ్ లో ఏవీఎం సంస్థ తమిళంలో ఓటీటీ కోసం ఒక సినిమా నిర్మించనుందట. భార్గవ్ విష్ణు అనే తమిళ దర్శకుడు తీసే ఈ చిత్రంలో మొదట కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. ఐతే, ఆమె తల్లి అయ్యాక, కాజల్ పేస్ లో ముసలితనం కనిపిస్తోంది అంటూ.. మొత్తానికి ఈ ప్రాజెక్టులోకి తమన్నాను పట్టించుకొచ్చారు. తమన్నాకి ఇప్పుడు ఇది అవసరం. ఆమె ఇంతవరకు లేడి ఓరియెంటెడ్ చిత్రంతో ఓ హిట్ కూడా కొట్టలేదు. ఒకవిధంగా తమన్నాకి మెయిన్ లీడ్ గా ఇది చివరి అవకాశమే అనుకోవాలి. అందుకే ఈ సినిమాతో తమన్నా జాతకం మారుతుందో లేదో చూడాలి.
Also Read:ఓటీటీ:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?