‘గుంటూరు కారం’లో త్రివిక్రమ్ ‘డ్రామా’

25
- Advertisement -

దర్శకుడు త్రివిక్రమ్ ఎప్పుడూ లేనిది గుంటూరు కారం సినిమాకి చాలా ఇబ్బంది పడ్డాడు. సహజంగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. పైగా త్రివిక్రమ్ స్క్రిప్ట్ రాస్తే.. ఏ హీరో వేలు పెట్టడు. కానీ, గుంటూరు కారం విషయంలో మాత్రం మహేష్ బాబు కాలు కూడా పెట్టాడు అని టాక్. మహేష్ అనగానే “హీరోయిజం ఎలివేషన్” అనే మాట గుర్తొస్తుంది. మహేష్ నటించే ప్రతి సన్నివేశం హీరోని ఎలివేట్ చేసే విధంగా ఉంటుంది. ఆ పద్దతి జనాలకు కూడా బాగా నచ్చింది. అందుకే, మహేష్ సినిమాల్లో మహేష్ పాత్రే హైలైట్ అవుతూ ఉంటుంది.

పైగా గుంటూరు కారం పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం సాధించాలి. అలాంటి సినిమా ఎలా ఉండాలి ?, అద్భుతంగా ఉండాలి కదా. మరి త్రివిక్రమ్ సినిమాలో కచ్చితంగా మ్యాటర్ ఉంటుంది కదా. ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు, “కథ లేకుండా మాటల”తో సినిమా నడిపిస్తున్నాడనే విమర్శలు కూడా త్రివిక్రమ్ పై చాలా ఉన్నాయి. జనవరి 12న విడుదల అవుతున్న “గుంటూరు కారం”లో కూడా తన డైలాగ్స్ తో మహేష్ హీరోయిజాన్ని ఆకాశం అంత ఎత్తుకు ఎలివేట్ చేస్తాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. అల్లు అర్జున్ లాంటి హీరోనే ఓ లెవల్లో చూపిస్తే ఇండియాలో గ్లామరస్ హీరోల్లో ఒకరైన మహేష్ ని ఇంకా భారీ రేంజ్ లో చూపించాలి కదా.

జనం అంతా అదే అనుకుంటున్నారు, దీనికితోడు.. ఇప్పటివరకు వచ్చిన గుంటూరు కారం ప్రమోషనల్ కంటెంట్ లో అదే కనిపించింది. ఐతే, “గుంటూరు కారం”లో యాక్షన్ కన్నా డ్రామా ఎక్కువ అని అంటున్నారు త్రివిక్రమ్. గుంటూరు కారం సినిమాలో డ్రామా ఎక్కువ ఉంటుందట. అద్భుతంగా డ్రామా చూపించాలని అనుకున్నాడట. మొత్తంగా గుంటూరు కారం సినిమాలో యాక్షన్ ఉంటుంది. కానీ, డ్రామా ఎక్కువ పండుతుంది” అని టాక్ త్రివిక్రమ్ తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు. అలాగే, డైలాగ్స్ మీద కాకుండా ఎమోషనల్ సీన్లు, డ్రామా మీదే కథ నడుస్తుందట.

Also Read:ఓటీటీ:ఈ వారం చిత్రాల పరిస్థితేంటి?

- Advertisement -