మ్యాచ్‌ విన్నర్‌ మలింగకు ఘనంగా వీడ్కోలు..

503
malinga rohith sharma
- Advertisement -

శ్రీలంక పేసర్ లసింత్ మలింగ వన్డే క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. శుక్రవారం కోలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మలింగకు ఘనంగా వీడ్కోలు పలికారు లంక ఆటగాళ్లు. ఈ మ్యాచ్‌లో 9.4 ఓవర్లు వేసిన మలింగ 38 పరుగులిచ్చి 3 వికెట్లు కూల్చాడు.

తన కెరీర్‌లో 226 వన్డేలు ఆడిన మలింగ 338 వికెట్లు తీశాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో 9వ స్థానంలో ఉన్నాడు. తన చివరి మ్యాచ్‌లో కుంబ్లే (337 వికెట్లు)ను మలింగ దాటేశాడు.ఐపీఎల్‌లోనూ మలింగ సత్తాచాటిన సంగతి తెలిసిందే. 2018 మినహా మలింగ 2009 నుంచి 2019 వరకు 122 మ్యచ్‌లు ఆడి 170 వికెట్లు పడగొట్టాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబైకి ఘన విజయాలను అందించాడు.

ఈ నేపథ్యంలో మలింగపై ప్రశంసలు గుప్పించాడు ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్ శర్మ. మలింగ వల్లే తాను ఓ కెప్టెన్‌గా..ఉత్కంఠ పరిస్థితుల్లో తేలిగ్గా ఊపిరి పీల్చుకోగలిగానని తెలిపారు. తనను తాను నిరూపించుకోవడంలోఎప్పుడూ విఫలం కాలేదని…అతడికి మంచి జరగాలని రోహిత్ శర్మ ట్వీట్ చేశాడు.

malinga

- Advertisement -