- Advertisement -
హైదరాబాద్ ఫీవర్ హాస్పిటల్ సమీపంలోని తిలక్‌నగర్ చౌరస్తాలో బుధవారం ఉదయం ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఏర్పడింది. వాహనాల రద్దీ సమయంలో ఈ ఘటన జరగడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు తక్షణమే స్పందించి వాహనాలను నిలిపివేసి, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ప్రమాదం తప్పింది. ఈ గుంత కింద నుంచి పెద్ద నాలా ప్రవహిస్తుండగా, సరిగ్గా ఆరు నెలల క్రితం కూడా ఇదే చోట రోడ్డు కుంగిపోవడం గమనార్హం.

- Advertisement -

