ఈటల భూఆక్రమణలపై సర్వే..

123
etela
- Advertisement -

బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు సంబంధించిన భూ ఆక్రమణలపై సర్వే ప్రారంభమైంది. జమున హ్యాచరీస్‌కు సంబంధించిన భూముల్లో అధికారులు సర్వే చేపట్టారు. మాసాయిపేట మండలం హకీంపేటలోని జమున హ్యాచరీస్‌ కంపెనీలో సర్వే జరుగుతోంది.

సర్వే నెంబర్ 130లోని 18 ఎకరాల భూములకు సంబంధించి ఈ సర్వే జరుగుతోంది. 130 సర్వే నెంబర్‌లో ఎక్కువ భూములు కబ్జా జరిగినట్లు సమాచారం ఉందని తహశీల్దార్ మాలతి చెప్పారు. మాసాయిపేట తహశీల్దార్‌ మాలతి, సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీ సుజాత ఆధ్వర్యంలో ఈ సర్వే నిర్వహిస్తున్నారు.

2016లో మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో తొలుత 40 ఎకరాలను సేకరించిన ఈటల రాజేందర్‌.. అక్కడ జమున హ్యాచరీస్‌ పేరుతో ఒక కోళ్లఫారాన్ని ఏర్పాటుచేశారు.తర్వాత 2017లో మరో పది ఎకరాల భూమిని, ఆ తర్వాత మరో 50 ఎకరాలను చుట్టుపక్కల రైతుల నుంచి తీసుకున్నారు. ఇలా సేకరించిన భూమిని ఈటల రాజేందర్‌ తన భార్య జమున, కుమారుడు నితిన్‌రెడ్డి పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించారు. అసైన్డ్‌ భూములను రైతుల నుంచి తీసుకోవడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఈ కోళ్లఫారానికి వెళ్లడానికి దళితులు, బీసీలకు చెందిన భూమిలోంచి రోడ్డు వేశారు.

- Advertisement -