గుడ్ లక్‌ సఖి..లేటెస్ట్ రిలీజ్ డేట్

132
good-luck-sakhi
- Advertisement -

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న చిత్రం గుడ్ లక్ సఖి. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతృత్వంలో ఎక్కువ మంది మ‌హిళా స‌భ్యులతో ఈ చిత్రం రూపొందింది. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న గుడ్ లక్ సఖి సినిమాని ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో ‘వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్’ బ్యానర్ పై సుధీర్ చంద్ర ప‌దిరి నిర్మిస్తున్నారు. చిరంతాన్ దాస్ సినిమాటోగ్రాఫ‌ర్‌.

ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ విడుదల చేయాలని భావించిన నిర్మాతలు ఇప్పుడు కాస్తంత వెనక్కి వెళ్ళారు.తొలుత నవంబర్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించినా తాజాగా కొత్త రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేశారు.

చిత్ర నిర్మాత సుధీర్ చంద్ర తెలియచేస్తూ, ”పలు కారణాల వల్ల ఈ సినిమా విడుదలను వాయిదా వేశాం. మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయి, థియేటర్ల సమస్య ఏర్పడకుండా ఉండేందుకు, భారీ ఎత్తున ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అన్ని విధాలుగా మాకు డిసెంబర్ 10 సరైన తేదీ అనుకున్నాం. ఈ సినిమా విజయంపై మాకు నమ్మకం ఉంది. ప్రేక్షకులందరికీ అద్భుతమైన అనుభూతిని ఈ మూవీ ఇస్తుందని నమ్ముతున్నాం అని తెలిపారు.

- Advertisement -