29 దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ క‌ల‌క‌లం…

191
lambda variant
- Advertisement -

ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు మరో కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. డెల్టా, డెల్టా ప్ల‌స్ వేరియంట్ పోయి ఇప్పుడు లాంబ్డా వేరియంట్ ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెడుతోంది. పెరూ దేశంలో బ‌య‌ట‌ప‌డిన ఈ కొత్త వేరియంట్ కేసులు 80 శాతం నమోదయ్యాయి. పెరు నుండి ఈ వేరియంట్ చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటైనాతో స‌హా 29 దేశాల‌కు వ్యాపించింది.

ఈ స్పైక్ ప్రోటీన్‌లో ఎల్ 452క్యూ, ఎఫ్ 490 ఎస్ తో పాటు ప‌లు ఉత్ప‌రివ‌ర్త‌నాలు ఉండ‌టంతో దీనిపై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ దృష్టిసారించింది. ఈ లాంబ్డా వేరియంట్‌ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ప్ర‌క‌టించింది. దీనిపై బ్రిట‌న్ శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు. ఇదికూడా ప్ర‌మాద‌కారిగా మారే అవ‌కాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -