ఒక కంపెనీ యజమాని తన సంస్థలో పని చేసే ఉద్యోగులను తన సొంతవారీగా చూసుకుంటే, ఉద్యోగులు కూడా ఆ సంస్థను తమ సొంతగా భావించి ఆ సంస్థ ఉన్నతికి ఎంతో కష్టపడి పనిచేస్తారు.ఇదే సూత్రాన్ని పాటించి వ్యాపారంలో వేల కోట్లు సంపాదించారు సూరత్‌కి చెందిన వజ్రాల వ్యాపారి లాల్ జీ భాయ్ పటేల్.
దేశంలో పేరుగాంచిన వజ్రాల వ్యాపారుల్లో ఒకడు. ఈయన ప్రతి ఏటా తన ఉద్యోగులకు భారీ కానుకలు ఇస్తుంటాడు. అంతేగాదు అనేక ఛారిటీ కార్యక్రమాలు నడిపిస్తుంటాడు. ఆడపిల్లల విద్యాపథకానికి 200 కోట్లు ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా తనవద్ద ఉన్న 6000 వేల కోట్లను బ్యాంకులకు అప్పగించి వార్తల్లో నిలిచాడు.దీనికి తను చెల్లించాల్సిన పన్ను ప్లస్ జరిమానా కలిపి దాదాపు 5400 కోట్లట.
ప్రతి సంవత్సరం తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు భారీ కానుకలు ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాడు ఈ వ్యాపారి. తనకు వ్యాపారంలో వచ్చిన లాభాలతో ఎన్నో సేవ కార్యక్రమాలను చేస్తున్నాడు. అందులో ముఖ్యంగా పేద ఇంటి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి వారికి అవసరమైన బంగారం, ఇంటి సామాన్లు అన్ని ఇతడే భరిస్తున్నాడు. వేలల్లో ముసలివారికి నెలనెలా ఫించన్ రూపంలో డబ్బును ఇస్తున్నాడు. పేదవారికి అందుబాటులో చాలా ఆసుపత్రులను కట్టించాడు.
ఇక గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన మోడీ సూట్ ను వేలంలో రూ.4.31 కోట్లకు కొనుగోలు చేశారు వజ్రాల వ్యాపారి లాల్జీ పటేల్.ఈ వేలం సొమ్మును గంగాశుద్ధి కార్యక్రమానికి కేటాయించారు.