డిసెంబర్ 1న ‘లక్ష్య’ ట్రైలర్..

186
- Advertisement -

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో రూపొందుతోన్ననాగ‌శౌర్య 20వ చిత్రం ‘ల‌క్ష్య’. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్నిసోనాలి నారంగ్ స‌మ‌ర్పణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

డిసెంబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా ‘లక్ష్య’ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేశారు మేకర్స్. అందులో భాగంగా డిసెంబర్ 1న ‘లక్ష్య’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో ప్రకటిస్తూ ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నాగ‌‌శౌర్య స‌ర‌స‌న కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో కీల‌క పాత్రల‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు.

- Advertisement -