సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్. అయితే ఈసినిమా విడుదల ను అపాలంటూ టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో.. పరిశీలించిన హైకోర్టు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఎన్నో వివాదాల మధ్య ఈచిత్రం ఎప్రిల్ 29న విడుదల కాబోతుంది. తాజాగా సినిమాపై మరోసారి స్పందించారు వర్మ. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు కేవలం ఒక్క థియేటర్ లోనే పదినిముషాల్లో వెయ్యి టికెట్లు అమ్ముడుపొయ్యాయని, ఈ ఓపెనింగ్స్ చూస్తుంటే కథానాయకుడు, మహానాయకుడు కన్నా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారన్నారు వర్మ. అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు .. జై బాలయ్య అంటూ వర్మ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మహేష్ బాబు మల్టీ ప్లెక్స్ ఏఎంబీ సినిమాలో బుకింగ్స్‌కి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా షేర్ చేస్తూ.. వీరిందరు అసలు సిసలైన ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని వర్మ పేర్కొన్నారు. తనదైన శైలిలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ప్రమోషన్స్ ను చేస్తున్నారు దర్శకుడు వర్మ. ఈచిత్రినిక రామ్ గోపాల్ వర్మ, అగస్త్య మంజు దర్శకత్వం వహించగా వైసిపి నేత రాకేష్ రెడ్డి, బాలగిరిలు నిర్మించారు. సినిమా విడుదల తర్వాత మరెన్ని సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.
ఓపెనింగ్స్ స్పీడ్ చూస్తుంటే😎 కథానాయకుడు మహానాయకుడు కన్నా 🙄లక్ష్మీస్ ఎన్టీఆర్ ని చూడడానికే ప్రజలు ఎగబడుతున్నారు, 😜అంటే నిజంగా నిజమే గెలిచిందనడంలో ఏ మాత్రం సందేహం లేదు💪💪💪. జై బాలయ్య💐💐💐 pic.twitter.com/sZnczj7WMb
— Ram Gopal Varma (@RGVzoomin) March 26, 2019