బాబును హీరో చేస్తే కోర్టుకు వెళ్తా..

209
Lakshmi Parvathi to stall NTRs movie ?
- Advertisement -

దివంగ‌త ముఖ్య‌మంత్రి, సినీన‌టుడు ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌పై సినిమా తీస్తామ‌ని నంద‌మూరి బాల‌కృష్ణ ప్రకటించగానే ప్రకంపనలు మొదలయ్యాయి. సినిమా ప్రారంభం కాకముందే పెద్ద కాంట్రవర్సీకి తెరలేచింది. ఎన్టీఆర్‌పై బయోపిక్ తీస్తానంటూ నందమూరి బాలకృష్ణ ప్రకటించి సంచలనం సృష్టిస్తే.. ఈ బయోపిక్ లో విలన్ ఎవరన్న అన్నదానిపై మరింత చర్చ సాగుతోంది. ఇంకెవరు అందులో విలన్ ఎవరైనా ఉన్నారంటే.. అది లక్ష్మీపార్వతేనంటూ ఏపీ ఎమ్మెల్యే బోండా ఉమ వివాదాస్పద వ్యాక్యలు చేశారు. ఓ డిబేట్ సందర్భంగా ఆయన.. లక్ష్మీపార్వతిని విలన్ అన్నారు.

విలన్ అనే అంశంపై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి కాస్త ఘాటుగానే స్పందించారు. బాలయ్య ఎన్టీఆర్ సినిమా తీస్తే తాను సదా స్వాగతిస్తానని… అయితే సినిమాను వక్రీకరిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.  తాను ఇన్నేళ్లుగా ఎన్టీఆర్‌ ఆత్మ‌గౌర‌వాన్ని నిల‌బెట్టుకుంటూ వ‌స్తున్నానని, తాను ఒక్క‌రూపాయి కూడా ఆశించ‌లేద‌ని ఆమె చెప్పారు.

చరిత్రను వక్రీకరించి చూపిస్తే మాత్రం తాను కోర్టుకెక్కి తీరుతానని హెచ్చరించారు. ఈ విషయంలో బాలయ్య ముందుగానే ఆలోచించుకోవాలని, చంద్రబాబును హీరోగా చూపిస్తూ, తనను దుష్టశక్తిని చేసి, తన నుంచి పార్టీని కాపాడినట్టు సినిమా తీస్తే మాత్రం సహించేది లేదని అన్నారు. ఆయన భార్యగా తానింకా బతికే ఉన్నానని, చిత్ర కథలో తేడా వస్తే ఊరుకోబోనని హెచ్చరించారు.

మరోవైపు ఈ అంశంపై బాలయ్య స్పందించారు. ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను ఎక్కడ మొదలుపెట్టాలో ఎక్కడ ముగించాలో తనకు తెలుసని ప్ర‌జ‌ల‌కు ఆయ‌న గొప్ప‌ద‌నాన్ని చెప్పాల్సిన బాధ్యత త‌మ‌పై ఉంద‌ని అన్నారు. ఎన్టీఆర్ గురించి ప్ర‌జ‌ల‌కు తెలిసిన విష‌యాల‌తో పాటు తెలియ‌ని అంశాల‌ని కూడా చూపిస్తామ‌ని అన్నారు. ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం ఎవ‌రు వ‌హిస్తార‌న్న విష‌యంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇది పెద్ద క‌మ‌ర్షియ‌ల్ సినిమా కాద‌ని అన్నారు. ఎన్టీఆర్‌ పాత్ర మాత్రం తానే చేస్తాన‌ని అన్నారు. ఆయ‌నో మ‌హానుభావుడ‌ని చెప్పారు. ఆయ‌న ఇచ్చిన స్ఫూర్తితోనే తాను నిజ‌జీవితంలో న‌డుచుకుంటున్నాన‌ని అన్నారు.

- Advertisement -