ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద లక్ష్మీపార్వతి మౌనదీక్ష..

426
- Advertisement -

టీడీపీ,కాంగ్రెస్ పొత్తుపై నిరసిస్తూ ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి మౌనదీక్షకు దిగారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ సమాధి వద్ద నివాళులర్పించిన ఆమె అనంతరం ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జరుగుతున్న పరిణామాలతో తాను తీవ్రంగా ఆవేదన చెందానన్నారు. నాలుగేళ్లపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పొత్తు పెట్టుకొని, ఎన్నికల ముందు ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు తాజా విన్యాసాలు ప్రారంభించారని విమర్శించారు.

Lakshmi Parvathi

ఆనాడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీని, ఎన్టీఆర్‌ ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి విమర్శించారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌కు చంద్రబాబు పొడిచిన రెండో వెన్నుపోటు ఇదన్నారు. ఆ మహానుభావుడి ఆత్మ క్షోభిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని పార్టీలతో పొత్తులు అయిపోయాయి. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నాడు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర పెట్టిండు చంద్రబాబు. టీడీపీలోని చాలా మంది సీనియర్ నేతలు కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకిస్తున్నారు. పొత్తు పెట్టుకుంటే అభ్యంతరం లేదు కానీ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవద్దు అని లక్ష్మీపార్వతి తెలిపారు.

- Advertisement -