ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నా…

285
VV Lakshmi Narayana has adopted Sahalaputtaga
- Advertisement -

సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర అదనపు డైరెక్టర్‌ ఆఫ్‌ జనరల్‌ (ఏడీజీపీ) జేడీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు ఓ వైపు బలంగా వినిపించాయి. ఇటీవల కాలంలో ఆయన ప్రజా సమస్యల అవగాహన కోసం ఒక అడుగు ముందుకేసి గ్రామాల పర్యటనలు చేస్తున్నారు.

VV Lakshmi Narayana has adopted Sahalaputtaga

శ్రీకాకుళం జిల్లాలో గత మూడు రోజులుగా ఆయన పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు. జిల్లాలో ఆయన పర్యటన ఈ రోజుతో ముగియనున్న సందర్భంగా జిల్లాలోని ఈ రోజు సహలాలపుట్టుగ గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

నేడు సహలాలపుట్టుగలో జరిగిన స్వచ్చభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..నా పర్యటనలను మొక్కబడిగా చేయటం లేదని ప్రజా సమస్యలను అవగాహన చేసుకోవటం కోసం చేస్తున్నానని ఆయన తెలిపారు. సమాజానికి నా వంతు కృషి చేస్తానని, రైతులకు పూర్వ వైభవం తెవాలన్నదే నా సంకల్పం అయన అన్నారు.

- Advertisement -