హ్యాపీ బర్త్ డే..లక్ష్మీ మీనన్

62
- Advertisement -

కుంకీ చిత్రంతో వెండితెరకు పరిచయమైన మ్యూటీ లక్ష్మీ మీనన్‌. తర్వాత విశాల్,విజయ్ సేతుపతి వంటి హీరోలతో జతకట్టి సక్సెస్ ఫుల్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇవాళ ఈ బ్యూటీ బర్త్ డే.

రామకృష్ణన్, ఉషా మీనన్‌ దంపతులకు 1996 మే 19న కొచ్చిలో లక్ష్మీ మీనన్ జన్మించింది. తండ్రి దుబాయ్ ఆధారిత కళాకారుడు, తల్లి కొచ్చికి చెందిన నృత్య ఉపాధ్యాయురాలు. తమిళ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది లక్ష్మీ మీనన్‌. 2013లో వచ్చిన నా బంగారు తల్లి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు ఆమె దగ్గరయింది. ఈ చిత్రం తెలుగుతో పాటుగా మలయాళంలో ఎంతె అనే పేరుతో ఒకే సారి నిర్మించారు. ఈ సినిమా విడుదలకంటే ముందే జాతీయ స్థాయిలో మూడు అవార్డులను గెలుచుకుంది.

Also Read:BRS: బి‌ఆర్‌ఎస్ కు ‘నో పోటీ’!

మలయాళ చిత్రం రఘువింటే స్వాంతమ్ రజియా (2011)లో సహాయ పాత్రలో తన నటనా రంగ ప్రవేశం చేసింది. ఆమె 2012లో తన తొలి తమిళ చిత్రం కుమ్కిలో కథానాయికగా నటించింది. అదే సంవత్సరం సుందరపాండియన్ చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత ఆమె నటించిన మూడు తమిళ చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. 2013లో ఉత్తమ మహిళా అరంగేట్ర ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. అలాగే ఉత్తమ నటిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును సుందరపాండియన్, కుమ్కిలో తన పాత్రలకు అందుకుంది.

Also Read:Vijayendra Prasad:అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్‌కే సాధ్యం

- Advertisement -