CMKCR:నిఖత్‌కు రూ.2కోట్లు…

33
- Advertisement -

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ తెలంగాణ సహా భారతదేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ప్రపంచ వేదికలమీద విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టను ఇనుమడింపచేసిన నిఖత్…రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. సచివాలయంలో నిఖత్ జరీన్‌తో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ కోచింగ్ రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రూ.2కోట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్‌ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.

Also Read: HarishRao:ఆరోగ్య తెలంగాణ ..వీఆర్‌ఏల క్రమబద్దీకరణ ఇంకా..!

- Advertisement -