ఈనెల 23న ల‌క్ష్మీబాంబ్ రిలీజ్‌

313
- Advertisement -

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘లక్ష్మీబాంబ్`. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు…

ఈ సంద‌ర్బంగా….మంచు లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ “జ‌డ్జ్ పాత్ర‌లో తొలిసారి న‌టించాను. చాలెంజింగ్‌గా తీసుకుని యాక్ట్ చేశాను. ద‌ర్శ‌కుడు కార్తీకేయ గోపాలకృష్ణ‌గారు సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమాను పూర్తి చేశారు. సినిమాను చ‌క్క‌గా తెరకెక్కించారు. పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు“ అన్నారు.

lakshmi-bomb-audio-launch-december-23

చిత్ర సమర్పకుడు గునపాటి సురేష్‌ రెడ్డి మాట్లాడుతూ ”పవర్ ఫుల్ సబ్జెక్ట్ తో, మంచి ఎమోషన్స్ తో లక్ష్మీ బాంబ్ సినిమాను రూపొందించాం. అనుకున్న ప్లానింగ్ లో సినిమా పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను సెన్సార్‌కు పంపుతాం.మంచు లక్ష్మీగారిని చాలా కొత్త రకంగా ప్రజెంట్ చేసే సినిమా. సునీల్ క‌శ్య‌ప్ సంగీతంలో విడుద‌లైన పాటలు, థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు తుది ద‌శ‌కు చేరుకున్నాయి. అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు జరుగుతున్నాయి“ అన్నారు.

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ “సినిమా చాలా బాగా వచ్చింది. మంచు ల‌క్ష్మిగారి స‌పోర్ట్‌తో సినిమాను అనుకున్న స‌మయంలో పూర్తి చేయ‌గ‌లిగాం. నిర్మాతలు సురేష్ రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి. డిసెంబ‌ర్ 23న విడుద‌లవుతున్న ల‌క్ష్మీ బాంబ్ అంద‌రినీ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది‘‘ అన్నారు.

lakshmi-bomb-audio-launch-december-23

పోసానికృష్ణ మురళి, హేమ, ప్రభాకర్‌, భరత్‌రెడ్డి, జీవా, అమిత్‌, హేమంత్‌, రాకేష్‌, సుబ్బరాయశర్మ, జె.వి.ఆర్‌, రాజాబాబు, శరత్‌, శ్రీహర్ష, విశాల్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: గునపాటి సురేష్‌ రెడ్డి, డ్యాన్స్‌: కిరణ్‌, ఆర్ట్‌: రఘుకులకర్ణి, ఫైట్స్‌: రాంబాబు, వెంకట్‌, నందు, ఎడిటింగ్‌: నందమూరి హరి, పాటలు: కరుణాకర్‌,కాసర్లశ్యామ్‌, సంగీతం: సునీల్‌కశ్యప్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, కథ, మాటలు: డార్లింగ్ స్వామి, లైన్ ప్రొడ్యూసర్: సుబ్బారావు, ఆర్‌.సురేంద్రరాజు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.మురళి, నిర్మాతలు: వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీ నరసింహ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తికేయ గోపాలకృష్ణ.

- Advertisement -