రజనీకాంత్‌కు గాయాలు…!

86
Rajinikanth suffers minor injury

సూపర్ స్టార్ రజనీ కాంత్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన చిత్రం రోబో. దర్శకుడు శంకర్ నిర్మించిన చిత్రాల్లో రోబో సినిమా చాలా ప్రత్యేక మైనదని మనం చెప్పనక్కర్లేదు. అయితే ఈ చిత్రం దేశ వ్యాప్తంగా వందల కోట్లు కొల్లగొట్టిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విజయాన్ని మరో సారి రుచి చూడాలని భావించిన శంకర్ బృందం రజనీకాంత్ కాంత్ తో రోబో కి సీక్వెల్ గా మరో చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి విధితమే.

Rajinikanth suffers minor injury

అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ కాలికి స్వల్ప గాయమైంది. చెన్నై శివారు ప్రాంతంలో 2.0 సినిమాను చిత్రీకరిస్తుండగా రజనీకాంత్ ఎడమ కాలికి స్వల్ప గాయమైనట్లు చిత్ర యూనిట్ తెలిపింది. షూటింగ్ సమయంలో మెట్లపై నడుస్తుండగా రజనీ జారి పడటంతో కాలికి గాయమైనట్లు చెప్పింది చిత్ర యూనిట్. షూటింగ్ నుంచి హుటాహుటిగా చెట్టినాడ్ ఆస్పత్రికి రజనీకాంత్‌ను తరలించారు. అరగంట పాటు కాలికి వైద్యం చేసిన డాక్టర్లు ఆ తర్వాత రజనీని ఇంటికి పంపించారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యంగా ఉన్నారని, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్రయూనిట్‌ సిబ్బంది తెలియజేశారు.

Rajinikanth suffers minor injury

శంక‌ర్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న రోబో 2.0 సినిమాలో బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. హీరోయిన్‌గా ఎమీ జాక్స‌న్ న‌టిస్తోంది. రూ.400 కోట్ల‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆసియాలోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్న‌ సినిమాగా రికార్డు సృష్టించబోతుంది.