మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
అయితే బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆకట్టుకోలేకపోయినా ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో మార్చి 9 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా తమిళ భాషలోనూ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం. ఓటీటీలోనూ ఈ చిత్రానికి నెగిటివ్ రెస్పాన్స్ దక్కింది. అయినా, కూడా మేకర్స్ ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళ్ డబ్బింగ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.
మరి ఈ తమిళ్ వెర్షన్ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి. లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు.
Also Read:రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

