టీడీపీకి పసుపు రాసి.. వైసీపీకి కుంకుమ పెట్టారు..!

229
jagan babu

ఏపీలో ఎన్నికల ఫలితాలపై సర్వేల ఫలితాలు నిజమయ్యాయి. సర్వేల ఊహాలకు అందని విధంగా వైసీపీ విజయం సాధించింది. టీడీపీ ఘోర ఓటమి పాలవ్వగా అధికారంపై ధీమాగా వున్న చంద్రబాబు..తన గెలుపుకు పసుపు-కుంకుమ పథకం కీలకమవుతుందని భావించారు. కానీ జగన్ హవా ముందుకు చంద్రబాబు పథకాలు పనిచేయలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో చంద్రబాబుపై నెటిజన్లు జోకులు పేల్చుతున్నారు.

()సైకిల్‌కు పసుపు రాసి ఫ్యాన్‌కు కుంకుమ పెట్టారు
()పసుపు కుంకుమ తీసుకుని ఉప్పూ కారం రాశారు
()40 ఏళ్ల అనుభవానికి 40 సీట్లు కూడా ఇవ్వని జనం
()బైబై బాబు..బాబు రిటర్న్ గిఫ్ట్ అందిందా
()మామకు ఆయన వెన్నుపోటు.. ఆయనకు పబ్లిక్ వెన్నుపోటు.. లెక్క సరిపోయిందిగా
()‘కోడికత్తి పార్టీ’ కత్తి మరీ ఇంత లోతుగా.. ఇంత బలంగా దిగుతుందని ఊహించని బాబు