ఆ సీక్వెల్‌ లో నయన్‌..?

207
- Advertisement -

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో 2.0 సినిమాను తెరకెక్కిస్తూ బిజీగా ఉన్న డైరెక్టర్‌ శంకర్.. ఓ వైపున ఈ సినిమాను విడుదలకి సిద్ధం చేస్తూనే…తన తర్వాతి ప్రాజెక్టుపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలోనే ‘భారతీయుడు’ సినిమా సీక్వెల్ కి ప్లాన్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయి.

Lady Superstar Nayanatara roped in for Indian 2

అయితే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతారను తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో టీమ్ ఉందట. శంకర్ – కమల్ కాంబినేషన్ అంటే నయనతార తప్పకుండా అంగీకరిస్తుందనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే .. కమల్ తో నయనతార చేసే మొదటి సినిమా ఇదే అవుతుంది. లైకా ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ‘భారతీయుడు’ సంచలన విజయం సాధించింది కనుక, సహజంగానే ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు వున్నాయి.

- Advertisement -