మహిళల్లో థైరాయిడ్.. ఎంత ప్రమాదమో!

83
- Advertisement -

నేటి రోజుల్లో థైరాయిడ్ సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళల్లో ఈ థైరాయిడ్ సమస్య అధికంగా కనిపిస్తోంది. నివేధికల ప్రకారం ప్రతి పది మంది లో కనీసం ఒకరు థైరాయిడ్ తో బాధపడుతున్నారట. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత కారణంగా థైరాయిడ్ సమస్య ఏర్పడుతుంది. ఆడవారిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం థైరాయిడ్ ప్రధాన లక్షణాల్లో ఒకటి. ఈ థైరాయిడ్ కారణంగా మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులు రావడం,, నాడీ వ్యవస్థ దెబ్బ తినడం, శ్వాస సంబంధిత వ్యాధులు ఏర్పడడం, జీర్ణ వ్యవస్థ మందగించడం.. వంటి ఎన్నో వ్యాధులు థైరాయిడ్ సమస్య కారణంగానే ఏర్పడతాయట. మరి ముఖ్యంగా మహిళల్లో సంతానోత్పత్తిపై దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. .

కొందరు మహిళలు థైరాయిడ్ కారణంగా గర్భం పోగొట్టుకుంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి థైరాయిడ్ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. ముఖ్యంగా థైరాయిడ్ ఉన్న మహిళలు క్రమం తప్పకుండా మెడిసిన్ తీసుకోవడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పక పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తినే ఆహారంలో అయోడిన్ ( ఊప్పు ) ఉండేలా చూసుకోవాలి. అయోడిన్ లోపం కారణంగానే థైరాయిడ్ సమస్య ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక థైరాయిడ్ ఉన్న మహిళలు వేగంగా బరువు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మెడిసిన్ క్రమం తప్పకుండా తీసుకుంటూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. అలాగే ఇంట్లో తల్లికి థైరాయిడ్ సమస్య ఉన్నట్లైతే కుమార్తెలు కూడా టెస్ట్ లు చేయించు కోవడం మంచిది. ఇలా థైరాయిడ్ సమస్య పట్ల జాగ్రత్తలు పాటిస్తూ దాని నుంచి వచ్చే ప్రమాదాలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Also Read:TDP :నో టికెట్.. షాక్ లో సీనియర్స్!

- Advertisement -