నేటి రోజుల్లో పురుషులతో పాటు మహిళలు కూడా సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి పది మందిలో ఒకరు లేదా ఇద్దరు మహిళలు సంతాన సామర్థ్య లేమితో సతమతమౌతున్నాట్లు నివేదికలు చెబుతున్నాయి. సాధారణంగా పురుషుల కంటే మహిళలే సంతానం కోసం ఎక్కువగా ఎదురు చూస్తుంటారు. అందువల్ల సంతాన లేమి ఉన్న మహిళలు ఎంతో మానసిక క్షోభకు గురవుతూ ఉంటారు. అయితే మహిళల్లో సంతాన సామర్థ్యం లోపించడానికి చాలానే కారణాలు ఉన్నప్పటికి.. వారి జీవన శైలి ఆహారపు అలవాటు కూడా ఒక కారణంగా చెబుతుంటారు ఆహార నిపుణులు. ఎలాంటి శారీరక శ్రమ లేకపోవడం వల్ల మహిళలు త్వరగా డయాబెటిస్ బారిన పడే అవకాశం ఉంది. .
డయాబెటిస్ అధికంగా ఉన్న మహిళల్లో సంతాన సామర్థ్యం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రతిరోజూ కొద్దిపాటి వ్యాయామం తప్పనిసరిగా చేస్తే ఎంతో మేలట. ఇంకా తినే ఆహారం విషయంలో కూడా తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తినాలి. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇంకా ఇందులో విటమిన్ ఏ, బి3, ఇ, ఫైబర్, పొటాషియం వంటి పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఇవన్నీ కూడా మహిళల్లో సంతానోత్పత్తి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఇంకా అంజీర పండ్లు కూడా మహిళల సంతాన సమస్యలను దూరం చేయడంలో ఎంతగానో తోడ్పడతాయి. ఇంకా జీడిపప్పు, బాదం, పిస్తా వంటివి తరచూ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే జింక్, మెగ్నీషియం, ఐరన్, గర్భధారణకు ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉండే బీన్స్ ను కూడా ఆహార డైట్ లో చేర్చుకుంటే హార్మోన్ల అసమతుల్యతను తగ్గించి ఫెర్టిలిటీ రేట్ పెంచుతుందట. కాబట్టి మహిళలు ఆహార డైట్ లో పైన సూచించిన వాటిని చేర్చుకోవడం వల్ల సంతాన సమస్యలను అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాట.
Also Read:తలనొప్పిలో ఈ లక్షణాలుంటే.. ప్రమాదమే!