మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటించి 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిత్రం ‘లూసిఫర్’. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘L2ఇ ఎంపురాన్’ తెరకెక్కగా మలయాళ, తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో ఈ చిత్రం మార్చి 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయి సాలీడ్ వసూళ్లను రాబట్టింది.
L2 కూడా హిట్ కావడంతో ఇప్పుడు మూడో పార్టుకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇండస్ట్రీలో వైరల్‌గా మారింది. L3 టైటిల్ ఖరారు చేశాడని త్వరలో అఫిషియల్ ప్రకటన రానుందని తెలుస్తోంది.
అయితే L3లో మరో క్రేజీ యాక్టర్ ఉండబోతున్నాడట. ఎవరో కాదు మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్. ఈ కథాంశం తీవ్రంగా ఉంటుందని, అబ్రహం ఖురేషి అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లి అలియాస్ లూసిఫర్ 1982 లో ముంబైకి వచ్చి తన మాఫియా సామ్రాజ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న ప్రయాణాన్ని ట్రాక్ చేసే నేపథ్యంలో థర్డ్ పార్టు ఉండబోతుందంటూ తెలుస్తోంది. దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

