టీఆర్ఎస్‌లో చేరిన ఎల్ ర‌మ‌ణ..

28

శుక్రవారం సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో తెలంగాణ టీడీపీ మాజీ అధ్య‌క్షుడు ఎల్ ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద‌ర్భంగా ర‌మ‌ణ‌కు సీఎం కేసీఆర్ గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ర‌మ‌ణ‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.. ఇటీవ‌లే టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ ర‌మ‌ణ టీఆర్ఎస్ పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వం తీసుకున్న విష‌యం తెలిసిందే.