- Advertisement -
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ఎల్ రమణ టీఆర్ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ తీర్ధం పుచ్చుకోగా టీఆర్ఎస్ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. కేటీఆర్ చేతుల మీదుగా ఎల్ రమణ.. టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా రమణకు కేటీఆర్‌తో పాటు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్‌తో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇటీవలే తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రమణ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -