తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ పార్టీ మారబోతున్నట్లుగా వార్తలు వస్తున్న సమయంలో.. త్వరలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరే విషయంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు ఎల్ రమణ. జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో రమణ సన్నిహితులు, పార్టీ కార్యకర్తలతో మంతనాలు చేస్తున్నారు. పార్టీ మార్పుపై సంకేతం ఇచ్చిన ఆయన.. కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రమణ కార్యకర్తలతో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇతర పార్టీలోకి వెళ్తే ఏమీ ఆశించవద్దని.. ఆశించి జరగపోతేనే నష్టం వస్తుందన్నారు. తాను ఏదీ ఆశించలేదని, ఎమ్మెల్సీలు, మంత్రి పదవులు ప్రచారంపై ఆశ పెట్టుకోలేదన్నారు. టీఆర్ఎస్‌లో 70 శాతం మంది నాయకులు తనకు సన్నిహితులేనని రమణ అన్నారు. మంత్రిగా, ఎంపీగా చేశానని, అలాగే జిల్లా కమిటీలో మెంబర్‌గా పని చేశానన్నారు. తన పనితనం మెచ్చి చంద్రబాబు అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారన్నారు. తాను ఎక్కడ ఉన్నా నీట్‌గా ఉంటానని, పదవుల కోసమే అయితే టీఆర్ఎస్‌లో ఎప్పుడో చేరే వాడినని అన్నారు. ఎంత చేసినా.. రాష్ట్రంలో టీడీపీ ముందుకు వెళ్లడం లేదని ఎల్. రమణ ఆవేదన వ్యక్తం చేశారు.