నటనకు గుడ్‌ బై చెప్పిన ఉదయ్‌ కిరణ్‌ హీరోయిన్‌..

135
Anita Hassanandani
- Advertisement -

బాలీవుడ్‌ నటి అనిత సినిమాలకు గుడ్‌ బై చెప్పింది. ఒకప్పుడు టాలీవుడ్‌ హీరో ఉద‌య్ కిర‌ణ్ హీరోగా న‌టించిన నువ్వు-నేను సినిమాలో హీరోయిన్‌గా అనిత న‌టించి మెప్పించిన విష‌యం తెలిసిందే. అనంత‌రం ఆమె ప‌లు సినిమాల్లో న‌టించింది. నాగిని సీరియ‌ల్ లోనూ న‌టిస్తోంది. కాగా, ఆమె పారిశ్రామికవేత్త రోహిత్‌ను 2013లో ప్రేమించి, పెళ్లి చేసుకుంది. ఇటీవలే ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో అనిత ఈ నిర్ణయం తీసుకుంది.

తాజాగా నటి అనిత ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాను త‌న కుమారుడికి జన్మనిచ్చిన అనంత‌రం సినీ ప‌రిశ్ర‌మ‌కు దూరం కావాలని ఎప్పటినుంచో అనుకుంటున్నానని చెప్పింది. ప్రస్తుత పరిస్థితుల్లో త‌న కుమారుడి సంరక్షణ చూసుకోవడం త‌నకెంతో అవసరమ‌ని తెలిపింది. ఇక‌పై తాను సినిమాలు, సీరియల్స్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నానని స్ప‌ష్టం చేసింది. అలాగే, భవిష్యత్తులో తిరిగి సినిమాలు, సీరియ‌ళ్ల‌లో న‌టిస్తానా? లేదా? అనే విషయాన్ని కూడా తాను ఇప్ప‌ట్లో చెప్ప‌లేన‌ని తెలిపింది. తాను ఇప్పుడు కొన్ని కమర్షియల్‌ యాడ్స్‌లో పనిచేస్తున్నానని చెప్పింది.

- Advertisement -