ఐపీఎల్-10లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో 163 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన పంజాబ్ జట్టు 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ ఆమ్లా (28) నిలకడగా ఆడాడు. మనన్ వోహ్రా (14), వృద్ధిమాన్ సాహా (14) ఫర్వాలేదనిపించారు. అక్షర్‌పటేల్ (24) పుణె బౌలర్లను నిలువరించాడు. డేవిడ్ మిల్లర్(30) అండగా రెచ్చిపోయిన పంజాబ్ కెప్టెన్ మ్యాక్స్ వెల్(44) ఫోర్లు సిక్సర్లతో ఈ సీజన్‌లో పంజాబ్‌కు తొలి విజయాన్నందించాడు.
అంతకుముందు టాస్ బ్యాటింగ్‌కు దిగిన పూణే ఆరు వికెట్లు కొల్పోయి 163 పరుగులు చేసింది. పూణే ఒపెనర్ మయాంఖ్ అగర్వాల్ (0) ను ఖాతా తెరవకుండానే తొలి ఓవర్ లో సందీప్ శర్మ అద్భుతమైన బంతితో పెవిలియన్ కు పంపాడు. అనంతరం రెండు పరుగుల వద్ద రహానే (19)కు లైఫ్ ఇచ్చిన నటరాజన్ అవుట్ చేశాడు. మానన్ వోహ్రా అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కెప్టెన్ స్మిత్ (26) పెవిలియిన్ చేరాడు. ధోనీ(5) కూడా నిరాశపర్చాడు. ఐపీఎల్‌లో ఖరీదైన ఆటగాడు బెన్ స్టోక్స్(50) ఈ మ్యాచ్లో మెరుగైన బ్యాటింగ్ చేశాడు. మనోజ్ తీవారీ అండగా స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్న స్టోక్స్ ను అక్సర్ పెవిలియన్ పంపాడు. మనోజ్ తివారీ(40) డెనియల్ క్రిస్టియన్ జతగా స్కోరు బోర్డును 163 పరుగులకు తీసుకెళ్లాడు.