ప్రభాకర్ రెడ్డికి బీ ఫామ్‌ను అందజేసిన సీఎం కేసీఆర్‌

73
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నిక‌కు టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి పోటీ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌భాక‌ర్ రెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాక‌ర్ రెడ్డికి కేసీఆర్ బీ ఫామ్‌ను అంద‌జేశారు. ఎన్నిక‌ల ఖ‌ర్చు నిమిత్తం పార్టీ ఫండ్ నుంచి రూ. 40 ల‌క్ష‌ల చెక్కును కేసీఆర్ అంద‌జేశారు.

ఈ సందర్భంగా ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ… మునుగోడు అభ్య‌ర్థిగా త‌న‌కు అవ‌కాశం ఇచ్చినందుకు కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు జీవ‌న్ రెడ్డి, గువ్వ‌ల బాల‌రాజు, ఎమ్మెల్సీలు త‌క్కెళ్ల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు, ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి త‌దిత‌రులు ఉన్నారు.

- Advertisement -