‘ఖుషి’ కలెక్షన్ల పరిస్థితేంటి ?

61
- Advertisement -

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ సమంత జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం నేడు రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై, బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తోనే ఖుషి మొదలైంది. మరి రేపటి నుంచి కూడా ఇదే ఊపుతో బాక్సాఫీస్ వద్ద ఖుషి దూసుకుపోగలదా ?, ఈ మూవీకి ఓపెనింగ్స్ బాగున్నాయి, అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. కానీ ఎంతవకు అవి కంటిన్యూ అవుతాయి అనేదే ఇప్పుడు పెద్ద డౌట్ గా మారింది. రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుంది అంటూ మేకర్స్ నమ్ముతున్నారు గానీ, ఇక్కడ అంత మేటర్ కనబడటం లేదు.

శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేమ, పెళ్లి..తదనంతర పరిస్థితులు అన్న కాన్సెప్ట్‌తో సాగింది. ఇందులో విజయ్, సమంతల మధ్య కెమిస్ట్రీ చూస్తే ఫిదా కావాల్సిందే. కానీ, ఫస్టాఫ్‌ బాగా సాగదీతగా అనిపిస్తుంది. పైగా కొన్ని రొటీన్ సీన్లు బోర్ కొట్టిస్తాయి. అలాగే మజిలీ సినిమా వాసనలు.. ఈ సినిమాలో బాగా కనిపించాయి. కాకపోతే, కామెడీ సీన్స్ బాగున్నాయి. అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్‌లో నిలబెట్టింది. కానీ, సినిమాని నిలబెట్టే స్థాయిలో ఇవి ఉన్నాయా అనేదే డౌట్.

ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం పలు సంస్థలు పోటీ పడ్డాయి. భారీ ధరకు ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ హక్కుల్ని సొంతం చేసుకుంది. కాగా.. అక్టోబర్ మొదటి వారంలో ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. అలాంటప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి పోయి ఈ సినిమాని చూడాల్సిన అవసరం ఏముంది ?. మరి చూద్దాం ఖుషి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో !!.
Also Read:అదే జరిగితే హస్తం “అల్లకల్లోలం ” !

- Advertisement -