- Advertisement -
కర్నూల్ బస్సు ప్రమాదంలో మరో సంచలన విషయం బయటపడింది. బస్సు లగేజ్ విభాగంలో ఉంచిన 234 కొత్త మొబైల్ ఫోన్లు మంటలను మరింతగా పెంచాయని తెలిపారు అధికారులు.
హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్ చేయగా.. అవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది.
కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమేనని తెలిపారు ఫోరెన్సిక్ నిపుణులు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని తెలిపారు ప్రత్యక్ష సాక్షులు.
మొబైల్ ఫోన్ల పేలుళ్లు మాత్రమే కాకుండా, బస్సులో ఏసీ వ్యవస్థకు అమర్చిన విద్యుత్ బ్యాటరీలు కూడా పేలిపోయాయని తెలిపారు ఏపీ అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ పి. వెంకటరమణ.
Also Read:నేటి నుంచి ఛఠ్ పూజ..
- Advertisement -

