కర్నూల్‌లో ఘోర ప్రమాదం.. బస్సు దగ్ధం

7
- Advertisement -

కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద వోల్వో బస్సులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బెంగుళూరు నుంచి హైద్రాబాద్ వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో 40 మంది ప్రయాణీకులు ఉండగా అత్యవసర ద్వారం పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డ 12 మంది ప్రయాణికులు బయటపడ్డారు. 20 మంది మృతి చెందారు.

ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోగా నిబంధనలకు విరుద్ధంగా వి.కావేరి ట్రావెల్స్ ఈ బస్సును నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్‌నెస్ గడువు ముగిసింది.

గతేడాది ఇన్సూరెన్స్ పాలసీ, ట్యాక్స్ ముగిసింది. 2024లోనే పొల్యూషన్ వ్యాలిడిటీ ఎక్స్‌పైర్ కాగా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనల కింద రూ.23,120 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి నలుగురు మృతి చెందారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గోళ్లవారిపల్లికి చెందిన గోళ్ల రమేశ్ (35), భార్య అనూష (32), కుమారుడు యశ్వంత్(8), కూతురు మన్విత(6) మృతి చెందారు. బెంగళూరులో స్థిరపడ్డ రమేష్ కుటుంబం.. హైదరాబాద్ వెళ్లి బెంగళూరు వస్తుండగా ప్రమాదంలో మృతి చెందారు.

- Advertisement -