చరిత్రను వక్రీకరిస్తే ఊరుకోం: కూనంనేని

38
sambhashivarao
- Advertisement -

గవర్నర్ తమిళి సై తీరును తప్పుబట్టారు సీపీఐ రాష్ట్రకార్యదర్శి కూనంనేని సాంబశివరావు. . ప్రజాస్వామ్యాన్ని కూల్చేలా గవర్నర్‌ వ్యవస్థ ఉందని విమర్శించారు.జేపీని ఎదుర్కొనేందుకు రాష్ట్రాల వారీగా పొత్తులు ఉంటాయని చెప్పారు. కాషాయ పార్టీని నిలువరించగలిగే పార్టీలతోనే చేతులు కలుపుతామన్నారు.

తెలంగాణ కోసం బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఏం త్యాగాలు చేశాయని ప్రశ్నించిన సాంబశివరావు… కష్టం, శ్రమ, త్యాగం ఒకరివి.. భోగాలు మరొకరివి అన్నట్లుగా ఉందని విమర్శించారు. సెప్టెంబర్‌ 17ను విలీన దినోత్సవంగా గుర్తించాలన్నారు. నాటి సాయుధ పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని కోరారు.

సీపీఐకి మళ్లీ పూర్వవైభవం తెచ్చేలా తీర్చిదిద్దుతామని చెప్పారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులకు ప్రాతినిధ్యం ఉండేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. ఎన్నికల కోసమే పొత్తులని, పార్టీ సిద్ధాంతం ఎట్టిపరిస్థితుల్లో మారదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు పార్టీ, భావజాలం, పోరాటాలు లేకుండా తెలంగాణ లేదన్నారు. కమ్యూనిస్టుల చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నారని విమర్శించారు.

- Advertisement -