ఏకనాథ్ షిండేపై ‘ద్రోహి’ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా కునాల్ కామ్రాపై పోలీస్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం కునాల్ కామ్రా మద్రాస్ కోర్టును ఆశ్రయించాడు.
స్టాండ్-అప్ కమెడియన్ కునాల్ కామ్రా స్వస్థలం తమిళనాడు విల్లుపురం. ముంబైలో నమోదైన FIR కేసులో తనను ముందుగా అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ట్రాన్సిట్ అటిసిపేటరీ బెయిల్ (Transit Anticipatory Bail) కోసం ఆయన పిటిషన్ దాఖలు చేశారు.
కామ్రా తన నివాసం తమిళనాడులో ఉన్నందున, మద్రాస్ హైకోర్టు అతనిపై జురిస్డిక్షన్ కలిగి ఉందని పేర్కొంటూ అక్కడే ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. శివసేన ఎమ్మెల్యే మురజీ పటేల్ ఫిర్యాదుతో భారతీయ న్యాయ సంహిత (BNS) ప్రకారం సెక్షన్ 353(1)(b), 353(2) (పబ్లిక్ మిస్చీఫ్), 356(2) (అపకీర్తి) కింద కేసు నమోదైంది.
గత వారం షిండేపై కామ్రా చేసిన వ్యాఖ్యలతో కోపోద్రిక్తమైన శివసేన కార్యకర్తలు, ముంబైలోని హాబిటాట్ స్టూడియో (Kamra ప్రదర్శనలు జరిగే ప్రదేశం) పై దాడి చేశారు. ఈ ఘటనలో పదకొండు మంది అరెస్టు అయినప్పటికీ, కొద్ది గంటల్లోనే వారందరికీ బెయిల్ మంజూరైంది.
Also Read:సీనియర్ సిటిజన్లకు డిజిటల్ కార్డులు

