కొబ్బరి మొక్కలు నాటిన కుమ్మరిగూడ గ్రామస్థులు

180
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని వికారాబాద్ జిల్లా కుమ్మరిగూడ గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం లో భాగంగా తడి, పొడి చెత్త డబ్బాలు పంపిణీ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 50 కొబ్బరి మొక్కలను పంపిణీ చేసి గ్రామస్తుల భాగస్వామ్యంతో నాటించిన అరుణా ఫొటో స్టూడియో యాజమాని నిమ్మల సతీష్.

ఈ సందర్భంగా నిమ్మల సతీష్ గారు మాట్లాడుతూ ప్రతి గ్రామం పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తడి ,పొడి చెత్తను వేరు చేసే డబ్బాలను పంపిణీ చేయడం జరిగిందని. అదేవిధంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో గ్రామంలో పచ్చదనం ఉండాలనే ఉద్దేశ్యంతో ఈరోజు కుమ్మరిగూడ గ్రామంలో 50 కొబ్బరి మొక్కలను గ్రామస్తులకు అందజేసి వారి చేత నాటించడం జరిగిందని తెలిపారు. వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని గ్రామస్తులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానయ్య, ఉప సర్పంచ్ గోపాల్, సుదర్శన్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -