కుంభమేళాలో అద్భుతం!

4
- Advertisement -

కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇప్పటికే కోట్లాది మంది దర్శనం చేసుకోగా రోజురోజుకు భక్తుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే కోట్లాది మంది వస్తున్న గాలి నాణ్యత ఏమాత్రం తగ్గలేదు. దీనికి కారణం మియవాకీ అనే జపాన్ టెక్నాలజీతో ప్రయాగ్ రాజ్ పరిధిలో ఓ చిన్నసైజ్ అడవిని తయారు చేసింది.

నగరంలో పలు చోట్ల 18.50 ఎకరాల ఖాళీ భూమిలో 5 లక్షలకు పైగా 63 రకాల మొక్కలు నాటారు. ఆ మొక్కలు ఇప్పుడు చెట్లుగా ఎదిగి ప్రతిరోజూ స్వచ్చమైన ఆక్సిజన్ ను వాతావరణంలోకి వదులుతున్నాయి. మియావాకీ టెక్నిక్ తో ఇదంతా సాకారం చేయడానికి ప్రయాగ్ రాజ్ మున్సిపాలిటీ 6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తక్కువ ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటి పెంచడమే మియావాకీ టెక్నిక్ ప్రత్యేకత.

మియావాకీలో భాగంగా మర్రి, రావి, వేప, చింత, ఉసిరి, రేగి, వెదురు తదితర 63 రకాల చెట్లను పెంచుతారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్వహణ కాంట్రాక్ట్ ను మూడేళ్ల పాటు ఓ కంపెనీకి అప్పగించింది. అదిప్పుడు సత్ఫలితాన్నిస్తోంది.

Also Read: పద్మ అవార్డులపై విజయశాంతి

- Advertisement -